Friday, April 26, 2024

ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన పంత్..

- Advertisement -
- Advertisement -

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. రిషబ్ పంత్ @ 13
టాప్3లో లబుషేన్

దుబాయి: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత యువ సంచలనం రిషబ్ పంత్ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గబ్బా టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో అజేయంగా 89 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన పంత్ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు లబుషేన్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరిచిన లబుషేన్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని టాప్3లో నిలిచాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. తాజా సిరీస్‌లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన కోహ్లి మిగతా టెస్టులకు దూరంగా ఉన్నాడు.

దీని ప్రభావం కోహ్లి ర్యాంక్‌లపై పడింది. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్టీవ్ స్మిత్ రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత స్టార్ చటేశ్వర్ పుజారా తాజా ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇక కెప్టెన్ అజింక్య రహానె కూడా టాప్10లో చోటు నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ కమిన్స్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత బౌలర్లు అశ్విన్ 8వ, బుమ్రా తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్‌లు టాప్10లో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది.

Rishabh Pant No 13 in ICC Test Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News