Monday, April 29, 2024

ఒమిక్రాన్ ప్రభావంతో పెరుగుతున్న యాక్టివ్ కేసులు : కేంద్రం

- Advertisement -
- Advertisement -

Rising active cases under the influence of Omicron: Center

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటోందని, దీని ప్రభావంతో యాక్టివ్ కేసుల్లో 77 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని 11 రాష్ట్రాల్లో 50 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గురువారం పాత్రికేయులకు వెల్లడించింది. వీటిలో ఒక్క కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, రాష్ట్రాల్లోనే 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల్లో లక్షకు పైగా ఉన్నాయని వివరించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ వేరియంట్ వేగంగా వ్యాపించిందని, దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బిఎ 2 ప్రాబల్యం అధికంగా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ ముమ్మరం చేయడంతో మరణాలు తగ్గుముఖం పట్టాయని, ఈ థర్డ్ వేవ్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇన్‌ఫెక్షన్ తీవ్రత కూడా తక్కువేనని పేర్కొంది.

కేసుల్లో 90 శాతం కన్నా ఎక్కువ హోమ్ ఐసొలేషన్‌లోనే తేలిక పాటి నుంచి పరిమిత మైన తీవ్రత కలిగిన లక్షణాలతో ఉంటున్నాయని, ఆక్సిజన్, ఐసియు పడకల అవసరం కలిగిన కేసులు చాలా స్వల్పమేనని వివరించింది. కావలసినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నందున, కరోనా వైరస్‌పై పోరుకు ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం చాలా ముఖ్యమని, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ సూచించారు. ఇతర వ్యాధులతో బాధపడేవారు కొవిడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, భారీ జనసమూహాల్లో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్ కేసులే కాకుండా డెల్టా వేరియంట్ కేసులు ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో కూడా కనిపిస్తున్నాయని, డెల్టా కారణంగా ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువై ఆస్పత్రిలో బాధితులు చేరవలసి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ పొందడం తప్పనిసరి అని, కొవిడ్ నిబంధనలు అనుసరించాలని సూచించారు. ఎవరైతే వ్యాక్సిన్ పొందలేదో, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారో అలాంటి వారే ఢిల్లీలో చనిపోతున్నారని చెప్పారు. ఇలాంటి రెండు వర్గాల వారే మొత్తం మరణాల్లో 64 శాతం వరకు ఉంటున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News