Monday, April 29, 2024

‘రొమాంటిక్’ లిప్ లాక్

- Advertisement -
- Advertisement -

Romantic

 

‘రొమాంటిక్’ మూవీతో తనయుడు ఆకాష్ పూరికి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా ప్రొడక్షన్ ప్రారంభమైన దగ్గరి నుంచి మంచి ప్రచార వ్యూహాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని సైతం తనదైన శైలిలో ప్రకటించారు. మే 29న ప్రపంచవ్యాప్తంగా ‘రొమాంటిక్’ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పూరి జగన్నాథ్ తెలియజేశారు. సమ్మర్ హాలిడేస్‌లో మంచి వినోదంతో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లకు ఈ సినిమా అలాంటి కాలక్షేపాన్నిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

ఇక హీరోయిన్ కేతికా శర్మతో హీరో ఆకాష్ లిప్ లాక్ చేస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ మూవీని అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ బ్యానర్‌లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Romantic Lip Lock
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News