Saturday, April 27, 2024

ఉగాదికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ కానుక..

- Advertisement -
- Advertisement -

RRR Movie New Photo

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్ కూడా ఈ సినిమాలో భాగంగా ఉండడంతో అటు హిందీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఉగాది పర్వదినం సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫుల్ టైటిల్‌ను ప్రకటించాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తోందట. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనేది ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ అనే సంగతి తెలిసిందే. దీనికి ఫుల్‌ఫామ్‌గా రెండు పేర్లు పరిశీలిస్తున్నారట. అందులో ఒకటి ‘రఘుపతి రాఘవ రాజారాం’ కాగా రెండవది ‘రామ రావణ రాజ్యం’. ఈ రెండింటిలో ఒక టైటిల్‌ను ఫైనల్ చేసి ఉగాది నాడు అధికారికంగా ప్రకటిస్తారట. ఈ టైటిల్ విషయం పక్కన పెడితే ఈ సినిమాను ‘బాహుబలి’ కంటే మించిన స్థాయిలో తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు రాజమౌళి. ప్రేక్షకులు, అభిమానుల భారీ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడట.

‘RRR’ full title to be announce on Ugadi Festival!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News