Friday, April 26, 2024

నల్గొండ జిల్లా కోటలో ‘ఆర్‌ఆర్‌ఆర్’

- Advertisement -
- Advertisement -

RRR shooting in Nalgonda district fort

 

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం పూణేలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. అయితే కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు మూడు నెలల నుండి ఈ మహమ్మారి చిక్కుల్లో చిక్కుకొని సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో మళ్లీ సినీ దర్శక నిర్మాతలు షూటింగ్ ప్రారంభించే పనుల్లో ఉన్నారు.

ఇక రాజమౌళి ప్లాన్ చేసిన పూణే షెడ్యూల్ రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు షూటింగ్ ప్రారంభిద్దాం అంటే పూణేలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి తన టీమ్‌తో బయట షూటింగ్స్ ప్లాన్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలోనే లొకేషన్స్ వెతుకుతున్నాడట. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్ దేవగణ్‌ల మధ్య సన్నివేశాలు చిత్రీకరించడానికి కోట అవసరం ఉందట. అందుకోసం ప్రస్తుతం రాజమౌళి టీమ్ నల్గొండ జిల్లాలో కోటను వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. పూణే షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికి ఇంతవరకు అక్కడ ఒక్కరోజు కూడా షూటింగ్ చేయలేదట. ఇంకా అలియా భట్, ఒలీవియా మోరిస్‌లతో సన్నివేశాలు ప్రారంభం కాలేదని తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News