Tuesday, April 30, 2024

డిసెంబర్ 3న ట్రైలర్

- Advertisement -
- Advertisement -

RRR trailer will be released on December 3rd

 

రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘రౌద్రం రణం రుధిరం’. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు భారీ స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు ఒక సరికొత్త పోస్టర్‌తో వెల్లడించడం జరిగింది. అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖనిలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News