Saturday, May 4, 2024

రూ.8.86 కోట్ల హెరాయిన్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఉగాండాలోని ఎంటెబే నుంచి ఈనెల 14న వచ్చిన టాంజానియా జాతీయుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకుని భారీ ఎత్తున హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్దగా హెరాయిన్ పట్టుకోవడం జరగలేదు. కిలో మించి బరువున్న ఈ హెరాయిన్ దాదాపు రూ.8.86కోట్ల విలువ ఉంటుందని అధికారులు వివరించారు. కచ్చిత మైన సమాచారం అందడంతో ఉగాండా లోని ఎంటెబ్బె నుంచి జులై 14న వచ్చిన ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకొని మాత్రల రూపంలో ఉన్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ కమిషనర్ కెఆర్ ఉదయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడు 86 హెరాయిన్ మాత్రలు మింగివేశాడని, అతని నుంచి దాదాపు 1.26 కిలోల బరువున్న హెరాయిన్ ను సంగ్రహించడమైందని తెలిపారు. భారత్‌లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. గత మే నెలలో ఇదే విధంగా ఉగాండా జాతీయుడి నుంచి రూ. 6.58 కోట్ల విలువైన హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఆ నిందితుడు పౌడరు రూపంలో ఉన్న 8ం కేప్సూల్స్‌ను మింగివేయడంతో అతని నుంచి సంగ్రహించ గలిగారు.

Rs.8.86 Crore Heroin Seized in Chennai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News