Tuesday, April 30, 2024

రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడికే అవకాశం

- Advertisement -
- Advertisement -
Russia Attack On Ukraine Possible In Next Several Days
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా ఎంత గట్టిగా వాదిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. అంతేకాదు ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయవచ్చన్న భయాలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడాలని అనుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే రష్యా ప్రభుత్వం మాత్రం ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన ఏదీ తమకు లేదని అంటోంది.‘గత కొంత కాలంగా అమెరికా, దాని మిత్ర దేశాలు భయపడుతున్నట్లుగా ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన ఏదీ మాకు లేదు’ అని రష్యా విదేశాంగ శాఖఒక బహిరంగ ప్రకటనలో తెలిపింది. కాగా ఉక్రెయిన్‌పై తప్పకుండా దాడి చేసే దిశగా రష్యా ముందుకు సాగుతోందని అంతకు ముందు ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఒక ట్వీట్‌లో అన్నారు. ఉక్రెయిన్‌పై జరగనున్న భద్రతా మండలి సమావేశంలో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాల్గొని తమ వైఖరిని తెలియజేస్తారని కూడా ఆమె తెలిపారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేయడమే మా లక్షం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏమిటంటే రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసే దిశగా ముందుకు సాగుతోంది’ అని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తప్పుదోవ పట్టిస్తున్న రష్యా: నాటో

ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సరిహద్దులనుంచి కొన్ని బలగాలు తమ బేస్‌లకు మళ్లుతున్నాయని చెప్పడం ద్వారా రష్యా ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవానికి అది ఉద్రిక్తంగా ఉన్న ఉక్రెయిన్ సరిహద్దుల్లోని బలగాలకు అదనంగా మరో 7 వేల బలగాలను పంపించిందని నాటో మిత్ర దేశాలు ఆరోపించాయి. ఈ చర్య, రష్యా దాడులను ప్రతిఘటించాలన్న తమ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని కూడా ఆ కూటమి గురువారం హెచ్చరించింది. దౌత్య పరిష్కారాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటామని రష్యా చేసిన ప్రకటనను నాటో చీఫ్ స్వాగతించినప్పటికీ కూటమిలోని మిగతా దేశాలు మాత్రం రష్యా ప్రకటించినట్లుగా బలగాల ఉపసంహరణ ఏమీ జరగడం లేదని అంటున్నాయి. రష్యా చేసిన ప్రకటనలకు భిన్నంగా జరుగుతున్నట్టు మాకు అర్థమవుతోంది. గడిచిన48 గంటల్లో సరిహద్దుల్లో అదనంగా దాదాపు 7 వేల బలగాలు పెరిగాయి’ అని బ్రసెల్స్‌లో నాటో దేశాల సమావేశానికి ముందు బ్రిటీష్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ చెప్పారు. తాము ఈ ముప్పును గట్టిగా ఎదుర్కొని తీరుతామని కూడా ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News