Tuesday, April 30, 2024

రష్యా విపక్ష నేతపై విషప్రయోగం?

- Advertisement -
- Advertisement -

రష్యా విపక్ష నేతపై విషప్రయోగం?
కోమాలో రష్యా అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అలెక్సే నావెల్నీ

Russian opposition leader Suspected Poisoning

మాస్కో: రష్యాలో అవినీతి వ్యతిరేక సంస్థ వ్యావస్థాపకుడు, ప్రతిపక్ష నాయకుడు అలెక్సే నావెల్నీ(44)తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సౌబీరియా నుంచి మాస్కోకు వస్తున్న సమయంలో విమానంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని ఓమ్స్‌క్ నగరంలో అత్యవసర ల్యాండింగ్ చేసి ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనపై విషప్రయోగం చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అలెక్సే ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘అలెక్సే నావెల్నీకు తేనీరులో విషం కలిపి ఉంటారని అనుమానిస్తున్నాం. ఉదయం నుంచి ఆయన అదొక్కటే సేవించారు. వేడి పదార్థంతో విషం శరీరం లోపలికి వెళ్లడంతో అది మరింతగా ప్రభావం చూపిందని వైద్యులు తెలిపారు’ అని మీడియా కార్యదర్శి కిరా యార్మిష్ తెలిపారు.

నావెల్నీపై గతంలో కూడా విషప్రయోగం జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌తో పాటుగా ‘రష్యా ఆఫ్ ది ఫ్యూచర్’ పార్టీ నేతగా ఉన్న నావెల్నీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బైటపెడుతున్నారు. వీటితో పాటుగా పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయన గతంలో అధ్యక్షుడిపై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన అనేక సార్లు జైలుకు వెళ్లారు కూడా. అయితే ఆయనపై పెట్టిన కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని తేలడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాకుండా అలెక్సేపై పలుసార్లు భౌతిక దాడులు కూడా జరిగాయి.

Russian opposition leader Suspected Poisoning

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News