Wednesday, November 6, 2024

అదే అసలైన ‘రిపబ్లిక్’ అంటున్న సుప్రీం హీరో..

- Advertisement -
- Advertisement -

Sai Tej REPUBLIC Motion Poster Released

హైదరాబాద్: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవాకట్టా కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ మేకర్స్ ప్రి ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, ఈ మూవీ కన్సెఫ్ట్ మోషన్ పోస్టర్ ను సాయి ధరమ్ తేజ్ తన ట్వీట్టర్ వేదికగా విడుదల చేశారు. ‘యువర్ ఆనర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు..ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పును ఒకరు దిద్దుకుంటూ, క్రమబద్దంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’ అంటూ సాయి తేజ్ చెప్పిన డైలాగ్ తో మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా, ఈ మూవీ సమ్మర్ లో విడుదల కానుంది.

Sai Tej REPUBLIC Motion Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News