Saturday, April 27, 2024

అప్పుడు చనిపోతానేమో అనుకున్నా

- Advertisement -
- Advertisement -

Samantha said Thought she would cringe and die after divorce

 

హీరో నాగచైతన్యతో స్టార్ హీరోయిన్ సమంత విడిపోయి రెండు నెలలు పూర్తయినా విడాకుల వ్యవహారంపై ఆమె ఇప్పటి వరకు నేరుగా స్పందించలేదు. విడాకులు ప్రకటించిన తర్వాత కొద్దిరోజులపాటు స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లి హాయిగా సేదతీరింది. అనంతరం సమంత కెరీర్ పరంగా బిజీ అయింది. అయితే సోషల్ మీడియాలో కూడా తన విడాకులకు సంబంధించి ఆమె ఏ రోజున మాట్లాడలేదు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి సమంత విడాకులపై స్పందించింది. “మన రోజు బాగోలేకపోయినా పర్వాలేదు కానీ ఈ సమయంలో మనం గళం విప్పాలి. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. జరిగిన దానిని అంగీకరిస్తే.. సగం పని పూర్తయినట్లే. అలా అంగీకరించడం ఇష్టం లేనప్పుడు ప్రతిరోజు అంతం లేని పోరాటం మన కళ్ల ముందు ఉంటుంది.

నా సమస్య ఇది.. నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే తప్పకుండా మార్గం కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచిస్తే.. నా జీవితం నా కళ్ల ముందు కనిపించింది. ఇప్పుడు నా జీవితాన్ని నేను పూర్తిగా అనుభవించగలను. వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యలతో నేను ఎంత బలంగా ఉన్నానో నాకు తెలిసింది. నేను చాలా బలహీనురాలినని నా భావన. విడాకుల తర్వాత కుంగిపోయి చనిపోతానేమో అనుకున్నా. కానీ అలా జరగలేదు. ఆతర్వాత నేను ఎంత బలవంతురాలినో తెలిసి ఆశ్చర్యపోయా. నేను ఇంత దృఢంగా ఉంటానని అనుకోలేదు. నన్ను చూస్తే నాకే గర్వంగా ఉంది” అని సమంత పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News