Tuesday, April 30, 2024

గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదని సర్పంచ్ రాజినామా

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు రావడం లేదని మనస్థాపానికి గురై జగిత్యాల జిల్లా బుగ్గారం మండంలోని చిన్నాపూర్ గ్రామ సర్పంచ్ దమ్మ లతశ్రీ తన పదవికి రాజీనామ చేసింది. మంగళవారం ఆమె రాజీనామ పత్రాన్ని జగిత్యాల డిపిఓకు సమర్పించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది కాలంగా గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ని ధులు ఇవ్వడం లేదని తెలిపింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడం, చిన్నాపూర్ గ్రామం ఎస్‌ఎస్‌జి గ్రామ పంచాయతీ గా ఎంపిక అయిందని పనుల విషయంలో అధికారులు ఒత్తిడి చేయడం, ఎంపిడ బ్లూ జీతాలు ఇవ్వలేక పోతున్నామని ఆవేదన వ్య క్తం చేశారు.

నిధులు రాక గ్రామ ప్రజలకు సేవ చేయలేని అసమర్ద సర్పంచ్ అని తట్టుకోలేక రాజీనామా చేశానన్నారు. కార్మికుల జీతాలు లేక మురికి కాల్వలు తీసే నాథుడు కరువయ్యాడని వాపోయారు. నిధులు లేక విద్యుత్ బల్బులు పెట్టలేక, బ్లీచింగ్ చేయాలేక, ట్రాక్టర్ డిజిల్ కొనలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. పనులు చేయలేక ప్రజలను ఇబ్బందులు పెట్టలేక తాను రాజీనామా చేస్తున్నట్లు సర్పంచ్ లతశ్రీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News