Friday, April 26, 2024

ఇటలీ నావికులపై కేసులు మూత

- Advertisement -
- Advertisement -

SC closed criminal case against Italian marines

న్యూఢిల్లీ: ఇటలీ మెరైన్‌లపై ఇండియాలో క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు మూసివేసింది. 2012లో ఇద్దరు భారతీయ మత్సకారులను కాల్చిచంపినందుకు ఈ నావికులపై కేసులు పెట్టారు. కేరళ తీరంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్రసంచలనానికి దారితీసింది. భారత్, ఇటలీల మధ్య దౌత్యపరమైన చిచ్చుకు దారితీసింది. ఇప్పుడు సంబంధిత కేసును మూసివేస్తున్నట్లు, బాధితుల వారసులకు ఇటలీ ప్రభుత్వం ఇచ్చే రూ 10 కోట్ల పరిహారం ముందు కేరళ హైకోర్టుకు అందాలి.తరువాత హైకోర్టు న్యాయమూర్తి ద్వారా ఇది సంబంధిత బాధిత కుటుంబాలకు అందేలా చూడాలని కేరళ హైకోర్టును ఆదేశిస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది . సంబంధిత అంశంపై ఇందిరా బెనర్జీ, ఎంఆర్ షాతో కూడిన వెకేషన్ బెంచ్ స్పందిస్తూ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తున్నట్లు, కాల్పుల దరిమిలా ఇద్దరు ఇటలీ నావికులపై విచారణల పర్వాన్ని ముగించి వేస్తున్నట్లు తెలిపింది.

SC closed criminal case against Italian marines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News