Tuesday, May 14, 2024

సిబిఎస్‌ఇ పరీక్ష ఫీజుల రద్దుపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

SC dismisses plea for waiver of exam fees

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న దృష్టా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను రద్దు చేయాలని సిబిఎస్‌ఇ, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 28న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సోషల్ జ్యూరిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఫీజులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఎలా ఆదేశించగలమని ప్రశ్నించిన ధర్మాసనం ప్రభుత్వానికి విన్నవించుకోవాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

గతంలో ఇదే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇస్తూ ఈ వ్యాజ్యాన్నే వినతిపత్రంగా పరిగణించి చట్టం, నిబంధనలు, ప్రభుత్వ విధానాల ప్రకారం మూడు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని, సిబిఎస్‌ఇని ఆదేశించింది. కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, వారికి కుటుంబాన్ని పోషించడమే భారంగా మారిందని వ్యాజ్యంలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది, ఒక్క ఢిల్లీలోనే 3 లక్షల మంది విద్యార్థులు సిబిఎస్‌ఇ స్కూళ్లలో చదువుకుంటున్నారని, హైకోర్టు ఉత్తర్వులు వీరికి న్యాయం చేయలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సోషల్ జూరిస్ట్ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News