Friday, April 26, 2024

సుశాంత్ మృతి కేసు సిబిఐకి బదిలి.. సుప్రీం తీర్పుపై హర్షం..

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్‌: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్ప‌గించింది. ఈ కేసులో ముంబ పోలీసులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న పూర్తి వివ‌రాల‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం తాజా తీర్పుతో సుశాంత్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించడంతో ప్రజల్లో సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని బీహార్ సిఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. కాగా, ముంబయిలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సుశాంత్ మరణంపై అతని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాట్నా పోలీసులు రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసును సుప్రీం కోర్టు సిబిఐకి బదిలి చేయడంతో నిజానిజాలు బయటకు వస్తాయని సుశాంత్ కుటుంబ సభ్యులు, అభిమానులు భావిస్తున్నారు.

SC Orders CBI Probe in Sushant Death Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News