Friday, April 26, 2024

నీట్ పరీక్ష అక్రమాలపై పిటిషన్లకు సుప్రీంకోర్టు తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

SC rejection of petition on Neet examination irregularities

 

న్యూఢిల్లీ: నీట్(యుజి) జాతీయ ప్రవేశ పరీక్షకు సంబంధించి పలు రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై నివేదికలు సమర్పించేలా ఆదేశించాలంటూ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 12న నిర్వహించిన నీట్ పరీక్ష సందర్భంగా పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేసులు నమోదైన విషయం తెలిసిందే. విశ్వనాథ్‌కుమార్, తదితరులు వేసిన పిటిషన్లపై జస్టిస్ ఎల్.నాగేశ్వర్‌రావు, జస్టిస్ బిఆర్ గవాయితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఫలితాలు వెల్లడయ్యే సమయంలో తమ జోక్యం పెద్ద సంఖ్యలో విద్యార్థులను గందరగోళంలోకి నెడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీట్ పరీక్ష అక్రమాలకు సంబంధించి సిబిఐ కూడా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దాంతో, కొందరు ఇప్పటికే పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా ఈ నెల 4న వాటన్నిటినీ తిరస్కరించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News