Wednesday, May 1, 2024

చైన్ లింక్ పేరిట.. ఆగని మోసాలు

- Advertisement -
- Advertisement -

Scams that don't stop in the name of Chain Link

మోసం పోయి పోలీసులను ఆశ్రయిస్తున్న వైనం

హైదరాబాద్‌ః రాష్ట్ర రాజధానిలో మరో ఎంఎల్‌ఎం సంస్థ యధేశ్చగా ఆన్‌లైన్ వస్తువుల పేరిట పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతోంది. ఆన్‌లైన్ (ఎంఎల్‌ఎం) సంస్థలపై సుప్రీం కోర్టు కొరఢా ఝలిపించిన్పటికీ సైలెంట్‌గా ఆన్‌లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాల కొనసాగుతూనే వున్నాయి. ఇటీవల కాలంలో ఓ సంస్థ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతోంది. రూ. 10 వేల నుంచి రూ.20వేలు వసూలు చేస్తూ చైన్‌లింక్ సిస్టంతో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి రూ. 20వేలు పెట్టి చేరడంతో పాటు మరో నలుగురిని రూ. 20వేలు చెల్లించాలని, దీంతో విహార యాత్రలు, ప్రత్యేక బహుమతులు సొంతమౌతాయని ప్రకటిస్తూ మదుపరులను ఆకర్షిస్తోంది. గతంలో మునక్కాయ. కరక్కాయ, పల్లీకాయ పేరిట మోసాలు వెలుగు చూస్తున్న తరుణంలో సదరు సంస్థ మోసగించేందుకు ఆన్‌లైన్ వస్తువుల పేరిట వసూళ్లకు పాల్పడుతోంది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సాంకేతిక పరిజానంతో చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాన మోసాలు మాత్రం ఆగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు అధికంగా చోట చేసుకుంటున్నాయని గుర్తించిన అధికారులు తీరా నేరం జరిగిన తరువాత ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించి వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా సారించడంతో పాటు గతంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన వారి డేటాను పూర్తిస్థాయిలో సేకరించడంలో పోలీసులు విఫలమౌతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నేరాలకు పాల్పడిన వారు ప్రస్తుతం ఎక్కడున్నారన్న సమాచారం సేకరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే నేర చరిత్ర ఉన్న సంస్థల భాగోతాలు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో నేరం చేసేందుకు నేరస్తులు భయపడాలి, నేరం చేసిన వారికి శిక్షపడేంతవరకు పోలీసులు వెంటపడాలని పోలీసు బాసుల ఆదేశాల అమలు విషయంలో కిందిస్థాయి సిబ్బంది అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో వివిధ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్నవారి కోసం ములాఖత్‌లలో వస్తున్న వారి వివరాలను సేకరించడం, ఆపై నేరస్తులను కుటుంబ సభ్యులు కాకుండా ఇతర నేరస్తులు కలిసి పెద్ద నేరాలకు కుట్రలు చేస్తున్న అంశాలపై పోలీసులు శీతకన్నువేయడం విచారకరం.

ఇదిలావుండగా అర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై పిడి యాక్ట్ ప్రయోగించినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వారు ఎక్కడు వున్నారు, మరోరూపంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారా? అని ఆరా తీయడంలేదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తుల ఏరివేతలో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్‌లు నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే కార్డన్ సర్చ్‌లలో లభ్యమైన నేర సమాచారాన్ని డేటా రూపంలో రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. జూన్ 10 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 200లకు పైగా కార్డన్ సర్చ్‌లు నిర్వహించారు. నేరస్తులు రాత్రుళ్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారం సైతం సేకరించేందుకు కార్డన్ సర్చ్‌లు ఉపయోపడుతున్నాయని పలువురు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. అనుమానితులు, నేరాలకు వ్యూహాలు, ప్రజలకు భరోసా కార్డన్ సర్చ్‌ద్వారా సాధ్యమౌతోందంటున్నారు. అయితే కొన్ని పోలీస్ స్టేషన్లలో కేవలం ఉన్నతాధికారుల మెప్పుకోసం మొక్కుబడిగా కార్డన్ సర్చ్‌లు నిర్వహిస్తుండటం విచాకరం.

పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసు శాఖ మరిన్ని వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను సైతం చైతన్యవంతం చేసేందుకు సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారీ ఎత్తున ఆర్థిక మోసాలు, కృరమైన నేరాలు చేసిన వారి కదలికలను గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఫేస్ రికగ్నేషన్ ఆర్థిన నేరగాళ్లపై ప్రయోగిస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమౌతాయి. తప్పి పోయిన వారి ఆచూకీ కోసం వినియోగిస్తున్న సాంకేతిక పరిజానాన్ని ఇకపై బడా నేరస్తుల కదలికల కోసం వినియోగిస్తే పెద్ద పెద్ద నేరాలు చోటుచేసుకోకుండా నివారించడం సాధ్యమౌతుంది. నేరాలు జరిగిన తరువాత పోలీసులు స్పందించడం కంటే నేరాలను నియంత్రించడంలో పోలీసులు ముందడుగు వేయాలని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. తాజాగా ఆన్‌లైన్ పేరిట మరో పెద్ద దోపిడీకి తెరతీసిన సంస్థలపై పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News