Monday, April 29, 2024

ఇంజినీరింగ్ బి కేటగిరి సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో 2023 -24 విద్యా సంవత్సరానికిగాను బి.టెక్, బి.ఫార్మసీ, ఫార్మ్ -డీ కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకిగాను ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ప్రకటించింది. ఈ సీట్ల భర్తీకి ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే రోజు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఈ నెల 31న దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఆయా కాలేజీలు వచ్చే నెల 15న ఎంపికైన విద్యార్థుల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది.

దీని ద్వారా రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాలో ఉంటే 30 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ ఇప్పటికే ముగియగా, వివిధ కోర్సుల్లోని 70,665 సీట్లను కేటాయించారు. ఈ నెల 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. చివరి దశ కౌన్సెలింగ్ ఆగస్టు మొదటి వారంలో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News