Sunday, April 28, 2024

ఏడాదికి కానీ కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి రాదు

- Advertisement -
- Advertisement -

Scientists believe Vaccine will take at least a year

 

శాస్త్రవేత్తల అభిప్రాయం

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ రూపకల్పన ఇంకా అశాస్త్రీయంగా ఉందని, ట్రయల్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంటోందని, ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటు లోకి రాడానికి కనీసం ఏడాదైనా పడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. విరుచకుపడుతున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రస్తుతం నిదానంగా చిన్నగా వైద్యచికిత్సల విధానం ఉంటోందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం తయారీ దశలో ఉన్న పది వ్యాక్సిన్లు చికిత్స పరిమాణంలో ఉండగా, మరో 126 వ్యాక్సిన్లు చికిత్స ముందటి (ప్రీ క్లినికల్ )దశలో ఉన్నాయి.

ప్రీ క్లినికల్ పురోగతి అంటే పరిశోధన దశ. ఈ సమయంలో సాధ్యాసాధ్యాలు, పునరుత్తాన పరీక్షలు, వ్యాక్సిన్ సురక్షితం తదితర అంశాలన్నీ పరిగణన లోకి తీసుకుంటారు. ఈ నెల మొదట్లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్, అమెరికా లోని ఇతర సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల ఆన్‌లైన్ సదస్సులో మేరీలాండ్ యూనివర్శిటీ కి చెందిన హ్యూమన్ వైరాలజీ సంస్థ డైరక్టర్ రోబర్టుగెల్లో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ రూపకల్పన, సంక్లిష్టతల పూర్తి చిత్రాన్ని సమీక్షించినట్టు, 2021 వరకు వ్యాక్సిన్ అందుబాటు లోకి రాకపోవచ్చని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు చెప్పారు.

వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే కానీ తిరిగి సాధారణ జీవితం గురించి ఊహించ లేమని అమెరికా డేవిస్ ఛాన్సలర్ గేరీ ఎస్. మే అన్నారు. అయితే ఇంకా ఎంతకాలం పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఆరు భారతీయ కంపెనీలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాము స్వల్ప, మధ్యాదాయ దేశాలకు ఏటా ఒక బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్ అందించేందుకు ఆస్ట్రా జెనెకా కంపెనీతో గతవారం ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఐఐటి గాంధీనగర్ బయోలాజికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమాశంకర్ సింగ్ ఈ ఏడాది ఆఖరులో వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. అప్పటికి వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చినా భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం, అదే విధంగా సరఫరా చేయడం సవాళ్లు అవుతాయని భారతీయ వైరాలజిస్టు అభిప్రాయ పడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News