Wednesday, May 15, 2024

తుక్కు విధానం మొదట ప్రభుత్వ వాహనాలపై అమలు: కేంద్రం ప్రతిపాదన

- Advertisement -
- Advertisement -

Scrap policy first implement on govt vehicles

 

న్యూఢిల్లీ: వాహనాల తుక్కు విధానాన్ని ప్రభుత్వ వాహనాలపై ముందుగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను రోడ్డురవాణాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్రాల రవాణా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థల వాహనాల విషయంలో నిబంధనల్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అవి అమలులోకి వస్తే 15 ఏళ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించుకునే వీలుండదు. వాటిని తుక్కు కింద పక్కకు పెట్టాల్సిందే. ఈ నిబంధనల్ని 2022,ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నది. కేంద్ర ప్రతిపాదనలపై భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలను కోరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News