Saturday, April 27, 2024

చరిత్ర తిరగ రాసిన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: యావత్తు ప్రపంచానికే తెలంగాణ గౌరవాన్ని చాటిచెప్పిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బైరి అంజయ్య గార్డెన్‌లో రెండవ విడత గొర్రెల పంపిణీపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 9 సంవత్సరాల పాలనలో సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధ్దిలో మొదటి స్థ్ధానంలో నిలిపి చరిత్ర తిరగరాశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గొల్లకుర్మల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ రూ. 11 వేల కోట్ల కేటాయించిందన్నారు. గత పాలకుల హాయంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరని కెసిఆర్ సిఎం అయ్యాక అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర నాయకులు మెచ్చుకుంటుంటే రాష్ట్ర నాయకులకు మాత్రం ఏ మాత్రం ఆర్ధం కావడం లేదన్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సీని స్టార్ రజనికాంత్ సైతం అభివృద్ధ్దిని చూసి పోగడ్తల వర్షం కురిపించిన రాష్ట్ర గజనిలకు మాత్రం అభివృద్ధ్ది కనబడటం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఇచ్చిన అవార్డులలో తెలంగాణకు 38 శాతం అవార్డులు వచ్చాయని ఇందుకు నిదర్శనం కెసిఆర్ పాలననే అని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పథకం అందని ఏ ఒక్క ఇల్లు లేదన్నారు. గొల్లకుర్మలకు గొర్లు పంపిణీ చేస్తామని ఓట్ల ముందు చెప్పలేదని కెసిఆర్ గుండెల్లో నుంచి ఈ సంక్షేమ పథకం వచ్చిందన్నారు. గొల్ల కుర్మల కోసం హైదరాబాద్‌లో కోకాపేట ప్రాంతంలో 500 కోట్ల విలువ గల స్థలంలో రెండు ఆత్మ గౌరవ భవనాలు నిర్మాణం అయ్యాయని వీటిని త్వరలో ప్రారంభించుకోబోతున్నామన్నారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వచ్చాక బాల్య వివాహాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. గొల్లకుర్మల జాతిని గౌరవించి రాజకీయంగా సిఎం కెసిఆర్ ఎంతో అవకాశం కల్పించారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ , ఒక రాజ్య సభ సభ్యునితో పాటు కార్పొరేషన్ చైర్మన్‌లలో గొల్ల కుర్మలు ఉన్నారన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి బిజెపి, కాంగ్రెస్ పార్టీల వారు ఎన్నో కుట్రలు పన్నారని అయినా మల్లన్న దేవుని పేరు పెట్టడంతో ప్రాజెక్టు పనులు మూడేళ్లలోనే పూర్తయినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో వచ్చిన గోదావరి జలాలతో మల్లన్న దేవుని పాదాలు కడిగి రుణం తీర్చుకున్నారన్నారు. తెలంగాణలో 99 శాతం మాంసాహారం తినే వారు ఉన్నారని అన్నారు. గొల్ల కుర్మల జాతి సంపదను పెంచి అన్ని విధాలుగా అండగా నిలిచామన్నారు.

గొల్ల కుర్మల నైపుణ్యాన్ని గొప్పతనాన్ని సిఎం కెసిఆర్ ఆసెంబ్లీలో కొనియాడారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి గొల్ల కుర్మ, యాదవులకు గొర్రెల యూనిట్లను అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండవ విడతలో 17 వేల మందికి జీవాలు మూడు నెలలలో అందజేస్తామన్నారు. గొల్ల కుర్మల అభివృద్ధ్దికి పాటు పడ్డ సిఎం కెసిఆర్ వెంట నే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ట్రైని కలెక్టర్ ఫైజాన్ ఆహ్మద్, గొల్లకుర్మ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్,

ప్రజాప్రతినిధులు, నాయకులు , గొల్లకుర్మ సంఘం ప్రతినిధులు కడవేర్గు రాజనర్సు, పాల సాయిరాం, రాదాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ఐలయ్య యాదవ్, పయ్యావుల ఎల్లం యాదవ్, మాదాసు శ్రీనివాస్, కనకయ్య, తిరుపతి, బాలమల్లు, రాములు, నర్సింలు, శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News