Tuesday, May 14, 2024

మళ్లీ పడగ విప్పుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -

second wave of coronavirus in hyderabad

హైదరాబాద్: నగరంలో చలి తీవ్రత పెరగడంతో కరోనా మహమ్మారి మళ్లీ ఉనికి చాటుకునే పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుందని, దీంతో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికి వైరస్ చాపకింది నీరుల్లా విస్తరిస్తుంది. రెండు రోజుల కితం ఎస్‌ఆర్ నగర్ పోలీసుస్టేషన్ నలుగులు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కోవిడ్ నిర్ధారణ అయింది. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల ప్రచారంలో స్దానిక ప్రజలు పాల్గొని కోవిడ్ జాగ్రత్తలు పాటించకుండా గుంపు గుంపులుగా ఒకే దగ్గర చేరడంతో వైరస్ మరోసారి ఉనికి చాటుకుంటుందని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కరోనా ఎక్కువశాతం 21నుంచి 40ఏళ్ల లోపు వారికే వస్తుందని, గత ఎనిమిది నెలల పరిధిలో నగరంలో 7,10, 598 మంది టెస్టులు చేయగా, 1354మంది మృతిచెందారు.

నగరంలో ర్యాపిడ్, ఆర్‌టిపిసిఆర్ టెస్టులు రోజుకు 5600మంది నిర్వహిస్తుండగా, అందులో మూడు శాతం మందికి పాజిటివ్ వస్తున్నట్లు బస్తీదవాఖానల సిబ్బంది పేర్కొంటున్నారు. ఎన్నికల తరువాత మళ్లీ టెస్టులు చేసుకునే వారి సంఖ్య పెరిగిందని, జలుబు, దగ్గు, జ్వరం వ్యాధులతో వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. డిసెంబర్ ,జనవరి నెలలు అత్యంత కీలకమని, చలితో ప్లూ వేగం విస్తరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజుల నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోయి,కనిష్ట ఉష్ణోగత్ర 15 డిగ్రీల నమోదైతుంది. ఇలాంటి వాతావరణంలో విషజ్వరాలకు కరోనా తోడైతే పరిస్దితులు ప్రమాదంగా ఉంటాయని వైద్యనిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా బిపి,షుగర్, అస్తమా దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. నగరంలో వ్యాపార సముదాయాలు, మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో జన సమూహం ఉండటంతో ఈరెండు నెలల్లో పాజిటివ్ కేసులు పెరుగుతాయంటున్నారు. ఎక్కడ చూసిన జనం ముఖానికి మాస్కులు ధరించకుండా కనిపిస్తున్నారని, దుకాణాల వద్ద శానిటైజర్ ఉపయోగించే స్టాండ్లు కనిపించడంలేదు. ప్రజలు ప్రధాన ద్వారం వద్ద ఒకరికి ఒకరు తాకుంటూ తిరుగుతున్నారు. దీంతో కరోనా కబళిస్తుందని, నిర్లక్షం చేస్తే కరోనా కాటు వేస్తుందని పేర్కొంటున్నారు. సేకండ్ వేవ్ చాలా ప్రమాదంగా ఉంటుందని, రెండోసారి వైరస్ సోకితే నయం కావడం కష్టంగా ఉంటుందని, గతంలో ఒకసారి పాజిటివ్ వచ్చిన వారు చాలా జాగ్రత్తలు పాటించి, ఏమాత్రం లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News