Monday, April 29, 2024

ఇంటి వద్దే సాధన

- Advertisement -
- Advertisement -

Shooter Manu Bakar

 

మనుబాకర్

న్యూఢిల్లీ: కరోనా మమహ్మరి నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ వల్ల పలు క్రీడలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఆటలు రద్దు కావడం, లాక్‌డౌన్ అమలులో ఉండడం తదిత కారణాలతో చాలా మంది క్రీడాకారులు ఇంటికే పరిమితమయ్యారు. ఇక, వీరిలో చాలా మంది ఆటగాళ్లు ఇంటి వద్దే సాధన చేస్తున్నారు. భారత యువ షూటర్ మను బాకర్ కూడా ఇంటివద్దే సాధన చేస్తోంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించిన మను బాకర్ తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది.

లాక్‌డౌన్ నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో మనుబాకర్ ఇంటివద్దే ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. 16 ఏళ్ల చిన్న వయసులోనే మనుబాకర్ భారత అగ్రశ్రేణి షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. పలు అంతర్జాతీయ షూటింగ్ పోటీల్లో భారత్‌కు పతకాలు సాధించి పెట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో మనుబాకర్ ఎదురులేని షూటర్‌గా అవతరించింది. నిలకడైన ఆటతో పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే ఒలింపిక్ బెర్త్‌ను కూడా సొంతం చేసుకుంది. కాగా, ఇంటివద్ద సాధన చేస్తున్న తనకు కోతుల బెడత ఇబ్బంది కలిగిస్తోంది. పెద్ద సంఖ్యలో కోతులు తరలి వస్తుండడంతో అనుకున్న విధంగా సాధన చేయలేక పోతున్నానని వాపోయింది.

 

Shooter Manu Bakar also practices at home
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News