Monday, April 29, 2024

కెనడాలో నిజ్జర్ అనుచరుడి ఇంటిపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులో సౌత్ సర్రేలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనుచరుడిగా భావిస్తున్న ఒక వ్యక్తి ఇంటిపై కాల్పులు జరిగినట్లు కెనడాలోని బిబిసి న్యూస్ శుక్రవారం తెలిపింది. ఆ ఇంటిపై గురువారం తెల్లవారుజామున 1.20(స్థానిక కాలమానం) గంటలకు కాల్పులు జరిగినట్లు వచ్చిన వార్తలపై తాము స్పందించామని రయాల్ కెనడియన్ పోలీసులు తెలిపారు. ఈ కాల్పులలో వెరూ గాయపడినట్లు తెలియరాలేదని బిబిసి తెలిపింది. కాల్పులు జరిగిన ఇల్లు నిజ్జర్ మితుడు సిమ్రన్‌జీత్ సింగ్‌కు చెందినదని తెలిపింది.

గత ఏడాది జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్య భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. సిమ్రన్‌జిఈత్ సింగ్ ఇంటి సమీపంలో నిలిపి ఉన్న ఒక కారు కాల్పుల కారణంగా తీవ్రంగా ధ్వంసమైందని, సింగ్ ఇంటిపై అనేక చోట్ల బుల్లెట్ల దాటికి రంధ్రాలు ఏర్పడ్డాయని బిబిసి తెలిపింది. సిసిటివి ఫుటేజ్ ద్వారా కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారి నుంచి, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారని బిబిసి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News