Monday, April 29, 2024

మెట్టు..మెట్టు ఎక్కి పదిలో ఫస్ట్ నిలిచాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Siddipet first position in SSC Results

సిద్దిపేట: తల్లిదండ్రులకు తమ పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఎంత ఆనందం ఉంటుందో? మన జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే తాను కూడా అంతే సంతోషంగా ఉన్నానని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లా ఏర్పాటైన తొలినాలలో 13 స్థానంలో ఉండే తర్వాత 9వ స్థానంలో, అదే దిశగా 3వ స్థానము లో మరింత కష్ట పడితే 2వ స్థానము లో నిలిచింది. ఈ సారీ ఎలాగైనా ఫస్ట్ నిలవాలి అని ప్రత్యేక తరగతులు, తల్లిదండ్రులు లేఖలు, సమీక్ష లు నిర్వహించి ఈ సంవత్సరం ప్రథమ స్థానం సాధించడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.. రాష్ట్రంలో దేశం లో ఏ అవార్డు వచ్చిన సిద్దిపేట ప్రథమ స్థానంలో ఉన్నామని విద్యా రంగంలో అది పది ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలిచి సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఇది అందరి సమిష్టి కృషి అని, సిద్దిపేట జిల్లా ప్రజలందరూ గర్వపడే సందర్భమన్నారు.. సిద్దిపేట గౌరవం , ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు.. విద్యార్థులకు మంచి విధ్యా బోధనలు అందించిడం , తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి ఆత్మవిశ్వాసం నింపారని, విద్యార్థులు తాము పెట్టిన ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవడం ఈ ఫలితమన్నారు. ఈ సంవత్సరం 97% తో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈ ఫలితాన్ని పదిలంగా కాపాడుకోవాలని, 100 శాతం ఉత్తీర్ణత దిశగా మరింత కష్ట పడాలని సూచించారు.

సిద్దిపేట విద్యాక్షేత్రం, వైద్య విద్యా నిలయం…

సిద్దిపేట జిల్లా సరస్వతి నిలయం, విద్యా క్షేత్రం, విజ్ఞాన జ్యోతిగా నిరంతరం వెలుగొందాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. సిద్దిపేటలో రెండు వైద్య కళాశాలలు, నర్సింగ్ కళశాల, వెటర్నరీ , 4 పాలిటెక్నిక్, మహిళ డిగ్రీ, ఐటిఐ , అగ్రికల్చర్ పాలిటెక్నిక్, ఉద్యాన, ఫారెస్ట్ కాలేజ్ లు ఇలా అన్ని విద్యాలయాలకు నెలవు గా సిద్దిపేట మారిందన్నారు. వైద్య విద్యార్థులు 2వేల మంది మన సిద్దిపేటలో ఉన్నారన్నారు. రేపటి తరం నేటి ఈ ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వారు స్ఫూర్తి అని అన్నారు. పది ఫలితం భావి విద్యార్థులకు స్ఫూర్తి దాయకమని, ఉత్తమ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఉన్నత శిఖరాలుగా నిలవాలన్నారు. ఒక ఐఎఎస్ డాక్టర్ , ఇంజినీర్ కావాలనే తపనతో పైచదువుల్లో పోటీ పడాలి అని సలహా ఇచ్చారు. భావి తరలాలో సిద్దిపేట విద్యార్థుల వారు ఎంచుకునే రంగంలో విశ్వ విజేతలు కావాలన్నదే తన తపన అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తుందని, అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని చెప్పారు. ఈ రోజు పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు ఇదే స్పూర్తి కొనసాగించాలన్నారు.

జిల్లాలో మూడు మండలాలు 100% ఫలితాలు..

సన్మానించి మిఠాయి తినిపించి సంబరాలు చేసుకున్న మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లాలో పది ఫలితాల్లో మూడు మండలాలు మార్కుక్, అక్కనపేట, రాయ్ పోల్ మండలాలు 100 % ఉత్తీర్ణత సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా మూడు మండలాలు ఎంఇఒలను సన్మానించారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో, ఉపాధ్యాయులకు మిఠాయి తినిపించి, జిల్లా విద్యాశాఖ అధికారిని మంత్రి హరీష్ రావు సన్మానించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు ఘనంగా సత్కరించారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News