Monday, April 29, 2024

తెలంగాణకు సిద్దిపేట మోడల్: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట బ్యూరో: బీఫార్మసీ కాలేజ్ అన్ని అనుమతులు పొంది ఈరోజు ప్రారంభించుకోవడం అంటే దాని వెనుక మంత్రి హరీష్ రావు కృషి తప్పకుండా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో ప్రేమతో నన్ను భాగస్వామ్యం చేసిన మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామాంచ లో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. దేశమంతా అభివృద్ధిలో తెలంగాణనే మోడల్ అని చెప్తుంటే తెలంగాణకే సిద్దిపేట మోడల్ గా నిలిచిందని ప్రశంసించారు. మంత్రి హరీష్ రావు ఇప్పుడే కాదు ఉద్యమ సమయంలో కూడా తాము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఏ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారా? అని ప్రభుత్వం పరిశీలించేదని సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు.

Also Read: హైదరాబాద్‌ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….

ఉద్యమంలో ఏదైతే ఆరాటం, తపన ఉండేదో ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్ తో హరీష్ రావు ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. సిద్దిపేటలో హరీష్ రావు మెజార్టీతో ఎవరూ పోటీ కూడా పడే పరిస్థితిలో ఉండరని, ముఖ్యమంత్రి కెసిఆర్ కెజి టు పిజి విద్య అనే చెప్పారని, అది ఇంప్లిమెంట్ చేసేందుకే తామంతా కృషి చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి వివరించారు. మంత్రి మానసిక పుత్రికల్లో గురుకుల పాఠశాల ఏర్పాటు ఒకటి అని, తొమ్మిది సంవత్సరాలలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్య ఈరోజు అందిస్తున్నామని సబితా ప్రశంసించారు. ఈ 9 సంవత్సరాలలో 1450 గురుకుల జూనియర్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ముందు నుంచి మహిళ విద్య కోసం పాటుపడే ఎగ్జిబిషన్ సొసైటీకి ఆమె అభినందనలు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మహిళా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారని, ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News