Wednesday, May 15, 2024

ఘనంగా సింగర్ సునీత వివాహం

- Advertisement -
- Advertisement -

సింగర్ సునీత వివాహం డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సునీత ఇద్దరు పిల్లలే దగ్గరుండి ఈ పెళ్లి చేయడం విశేషం. ఇక పెళ్లికి ముందు సునీత ఇంట మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో పసుపు చీరలో మెరిసిపోతున్న సునీత ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ ఫంక్షన్‌కు యాంకర్ సుమ కూడా హాజరయ్యారు. ఇక అభిమానులు సోషల్ మీడియా ద్వారా సునీతకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.

Singer Sunitha gets engaged to Ram Veerapaneni

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News