Monday, November 4, 2024

ఉగాది కానుకగా…

- Advertisement -
- Advertisement -

'Tuck Jagadish' first look to release on Ugadi

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ‘టక్ జగదీష్’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. ఈ మూవీలో జగదీష్ నాయుడుగా నాని పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తే తెలిసింది. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఉగాది పండుగ కానుకగా ఈ సినిమా రానుంది. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో జగపతిబాబు, రావురమేష్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Tak Jagadish movie first look to release on Ugadi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News