Saturday, May 4, 2024

సారూ.. మా రోడ్డు బాగు చేయండి

- Advertisement -
- Advertisement -

బాసర : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓని -, బాసర మార్గన గల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణీకులు , గ్రామస్తులు రాత్రి వేళల్లో ఈ రోడ్ల గుండా ప్రయాణించాలం భయపడుతున్నారు. ఎమ్మెల్యే సారూ.. ఒక్కసారి మా రోడ్డు పరిస్థితి చూడండని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా భారీ వర్షాలకు ఈ మార్గంలోని వంతెన శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

వంతెన సమీపం నుండి ఒని వరకు ఆరు చోట్ల గండి పడి గుంతలు ఏర్పడడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర మండల పరిధిలోని ఓని, కౌట, సాలాపూర్, సవర్గాం, సురెల్లి, కిర్గుల్, ముథోల్ మండలం బ్రహ్మణ్‌గాం, ఆష్టా, విఠోలి, అబ్దుల్లాపూర్, కనకాపూర్ ఇలా దాదాపు సుదూర ప్రాంతాలనుండి బోని బాసర రోడ్డు మార్గాన ద్విచక్రవాహనంతో పాటు ప్రత్యేక వాహనంలో నిత్యం బాసరకు వస్తారు. వైద్యం కోసం నిజామాబాద్ పట్టణానికి వెళతారు.

అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఏకైక రైల్వేస్టేషన్ బాసరలో ఉన్నందున పరిసరాల ప్రజలు ప్రయాణీకులు ర్పైు మార్గాన మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యాభ్యాసం కోసం వ్యాపారరీత్యా వైద్యం ఇలా తమ తమ పనుల నిమిత్తం ఈ రోడ్డు మార్గాన అనేక వాహనాలు రాత్రి పగలు, వెళుతూ ఉంటాయి.. దీనితో కొందరు బాసర ఆలయంలో , ట్రిపుల్ ఐటీ కళాశాలలో పనిచేసే సిబ్బంది ఈ రహరది వెంబడి ప్రయాణించి నిత్యం తమ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. కాగా ఇప్పుడు బాసర వెళ్లాలం ముథోల్ నుండి వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. సుమారు 20 కిలో మీటర్ల మేర దూరం అదనపు భారంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News