Wednesday, May 1, 2024

వారాసిగూడలో పేలిన గ్యాస్ సిలిండర్…

- Advertisement -
- Advertisement -

Cylinder-Blast

హైదరాబాద్: సికింద్రాబాద్ వారాసిగూడలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Six Injured in Gas Cylinder Blast in Warasiguda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News