Wednesday, May 1, 2024

‘నీ చుట్టు చుట్టు…’ సాంగ్ ప్రోమో..

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’. ఈ సినిమాలో రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో బోయపాటి శ్రీను చూపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ నీ చుట్టు చుట్టు… ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ డ్యాన్స్ నంబర్ ఫుల్ లిరికల్ వీడియో గురువారం ఉదయం 9:26 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రామ్ మందపాటి గడ్డంతో మాస్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల మెరిసే వేషధారణలో గ్లామర్‌గా కనిపిస్తుంది.

ప్రోమో చేస్తే ఇది ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఎస్‌ఎస్ థమన్ ఈ సినిమా కోసం రాకింగ్ ఆల్బమ్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా స్కంద సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News