Wednesday, May 1, 2024

‘స్కంద’ వచ్చేది అప్పుడే..

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ -ది ఎటాకర్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కోసం బెస్ట్ డేట్‌ని లాక్ చేశారు. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ ఈ నెల 28న విడుదల కానుంది. స్కంద సినిమా గురువారం విడుదల కానుంది కాబట్టి లాంగ్ వీకెండ్ వుంటుంది. ఆ తర్వాత సోమవారం (గాంధీ జయంతి) సెలవు.

దసరా సెలవులు కూడా కలిసిరాబోతున్నాయి. ఈ రకంగా ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ కి ఇది పర్ఫెక్ట్ డేట్. రిలీజ్ డేట్ పోస్టర్ లో రామ్, శ్రీలీల అందమైన చిరునవ్వులు చిందిస్తున్నారు. పంచెకట్టులో రామ్ చాలా కూల్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల గాగ్రా చోళీలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కనిపిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. స్కంద మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News