Saturday, May 4, 2024

చిన్నారుల్లో నైపుణ్యాల పెంపు

- Advertisement -
- Advertisement -

వర్చువల్ విధానంలో శిక్షణ తరగతులు
రాష్టవ్యాప్తంగా 300 బాలల సంరక్షణ కేంద్రాల్లో వీకెండ్ వర్క్‌షాప్
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్

Skills development in children

 

మనతెలంగాణ,హైదరాబాద్: చిన్నారుల్లో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీయడంతో పాటు సమాజంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించాల్సిన బాధ్యత ఉందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ అన్నారు. సోమవారం రాష్టంలోని 300 బాలల సంరక్షణ కేంద్రాల్లోని బాల, బాలికలకు క్రియేటివ్ ఆర్ట్ వీకెండ్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని వర్చువల్ గా ఆమె ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా బాలల సంక్షేమ కమిటి అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, సభ్యులు ఉదయరాణి, డాక్టర్ రమాదేవి, నీరజ, ముంతాజ్ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ పర్యవేక్షణలో వేసవి శిబిరాల్లో భాగంగా బాలబాలిలకలు ఎన్నో రకాల జీవన నైపుణ్యాలు నేర్చుకున్నారని, వాటిని వారు నిత్య జీవితంలో అన్వయించుకొని మంచి ఫలితాలు పొందారని తెలిపారు.

ఈ నేపథ్యంలో వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 బాలల సంరక్షణ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా విద్యాలయాలు మూతపడడంతో విద్యార్థుల సహజ సామర్థ్యాలను బయటపెట్టానికి అవకాశాలు లేకుండాపోయాయి. తిరిగి నైపుణ్యాలను వృద్ధి చేసేందుకు వీలుగా వేదిక్ మాథ్స్, బేసిక్, ఆడ్వాన్స్ ఇంగ్లీష్, యోగ, వ్యకిత్వ వికాసం, ఆరోగ్య విద్య, వకృత్వం, వ్యాసరచన నైపుణ్యాలు, డ్రాయింగ్, రోల్ ప్లే డ్రామాస్,ఆయా రంగాల్లో నిపుణులతో వర్చువల్ గా శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి శని,ఆదివారాల్లో ఆరు నెలల పాటు వర్చువల్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ‘క్రై పౌండేషన్’ సహకారంతో మరికొంత మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్‌తో మరింత సులభమైన విధానాలు, పద్దతులతో విద్యార్థులు సులభంగా నేర్చుకొనే విధంగా పలు అనేక అంశాలకు సంబంధించిన మెలుకువలు అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News