Saturday, April 27, 2024

స్మృతీ ఇరానీకి రాహుల్ ఫ్లయింగ్ కిస్?

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. బుధవారం ఆమె లోక్ సభలో మాట్లాడారు. భారత దేశం నుంచి మణిపూర్‌ను ఎవరూ విడదీయలేరని తెలిపారు. అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని స్మృతి ధ్వజమెత్తారు. యుపిఎ హయాంలో ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు జరిగాయని, ఆర్టికల్ 370 రద్దు వల్లనే రాహుల్ పాదయత్ర చేయగలిగారని, ఆర్టికల్ 370ని మళ్లీ తెస్తామని రాహుల్ చెబుతున్నారని, కశ్మీర్ పండిట్లకు జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై స్పీకర్‌కు బిజెపి మహిళా ఎంపిలు ఫిర్యాదు చేశారు. రాహుల్ సభ నుంచి బయటకు వెళ్లే సమయంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. సిసి ఫుటేజీ పరిశీలించాలని మహిళ ఎంపిలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

Also Read: మీరు భారత మాతను హత్య చేశారు: రాహుల్

లోక్‌సభ్ నుంచి రాహుల్ బయటకు వెళ్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలు చేశారు. రాహుల్‌కు ఏమైందని రవిశంకర్ ప్రశ్నించారు. లోక్‌సభలో మహిళలు ఉన్నారని, రాహుల్ సంస్కారహీనంగా ప్రవర్తించడం బాధాకరమైన విషయమని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News