Monday, May 6, 2024

లాలూ మీ ఇంట్లోకి పాము చొరబడింది: కేంద్రమంత్రి

- Advertisement -
- Advertisement -

పాట్నా: నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బిజెపి కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్‌జెడితో చేతులు కలపడంతో బిజెపి నాయకులు నితీష్ కుమార్‌పై మండిపడుతున్నారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. ఐదు సంవత్సరాల క్రితం ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ట్వీట్ ఉటంకిస్తూ లాలూ ఇంట్లోకి పాము చొరబడిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2017లో ఆర్‌జెడితో జెడియు పొత్తు రద్దు చేసుకొని బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నితీష్ అనే పాము రెండు సంవత్సరాలకొక సారి కుబుసం విడుస్తుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను ఉపయోగించి కేంద్రమంత్రి గిరిరాజ్ నితీష్‌కు చురకలంటించారు. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీలో బలబలాలు బిజెపికి 77, ఆర్‌జెడి(80), జెడియు(45), కాంగ్రెస్ (19), సిపిఐఎంఎల్(19), సిపిఐ(02), సిపిఎం(02), హెచ్‌ఎఎం(04) సీట్లు గెలుచుకున్నాయి. 164 సీట్లతో మహాఘట్‌భంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News