Wednesday, May 1, 2024

సోనూసూద్ కు కరోనా పాజిటివ్…

- Advertisement -
- Advertisement -

Sonu Sood tests positive for Covid-19

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కు కరోనా వైరస్ సోకింది. కరోనా కష్టకాలంలో వేలాది మందికి ఆపద్బాంధవుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా అనే విషయం శనివారం ఉదయం నిర్ధారణ అయిందని తెలిపారు. సురక్షిత చర్యల్లో భాగంగా ఇప్పటికే హోం క్వారంటైన్ లో ఉన్నానని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. తన గురించి ఆందోళన చెందవద్దని, మీ సమస్యలను పరిష్కరించేందుకు తనకు కొంత సమయం లభించిందని తెలిపారు. మీకోసం నేనున్నాననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సోనూసూద్ సూచించారు.

Sonu Sood tests positive for Covid-19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News