Friday, April 26, 2024

గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

Special arrangements by RTC for Ganesh immersion

29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు
రెండు కాల్ సెంటర్ల ఏర్పాటు

హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం కోసం 565ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ యాదగిరి తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులను నగరంలోని పలు ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ప్రయాణికులు రద్దీని గమనించి ఆయా రూట్లలో అర్దరాత్రి దాటిన తర్వాత కూడా ప్రత్యేక బస్సులను కూడా నడుపుతామన్నారు. పోలీసు అధికారుల ఆదేశాలను సారం ప్రయాణికులు సౌకర్యం కోసం మూడు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ మార్గ్, గాంధీ మార్గ్ అవుట్ పోస్టు,బషీరాబాగ్‌లోని మెయిన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు మరింత సమాచారం కోసం రెండు ప్రత్యేక కాల్‌సెంటర్లను రైతిఫిల్ (9959226154), కోఠీ (9959226160) సంప్రదించాలన్నారు. అధికారుల కలిగిస్తున్న ఈ ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక బస్సుల వివరాలు
కాచిగూడకు డిపో నుంచి 20 బస్సులు బషీర్‌బాగ్- కాచిగూడ, ముషీరాబాద్ డిపో-1కు చెందిన 20 బస్సులు బషీర్‌బాగ్-రామ్‌నగర్, దిల్‌షుక్‌నగర్ డిపోకు చెందిన 15 స్సులు ఓల్డ్‌ఎమ్మెల్యేక్వార్టర్స్- కొత్తపేట,హయత్‌నగర్ డిపో-1కు చెందిన 20బస్సులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- ఎల్‌బినగర్, హయత్‌నగర్ -2 డిపోకు చెందిన 15 బస్సులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- వనస్థలిపురం, మిధాని డిపోకు చెందిన 15బస్సులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- మిధాని,ఉప్పల్ డిపోకు చెందిన 20 బస్సులు టిటిడి కళ్యాణమండపం- ఉప్పల్, ఇందిరాపార్క్- ఉప్పల్, కంటోన్మెంట్ డిపోకు చెందిన 20 బస్సులు ఇందిరాపార్క్- సికింద్రాబాద్, హకీంపేట డిపోకు చెందిన 20 బస్సులుఇందిరాపార్క్- రీసాలాబజార్,కుషాయిగూడ డిపోకు చెందిన 20 బస్సులు ఇందిరాపార్క్,మల్కాజిగిరి-ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్స్, చెంగిచర్ల డిపోకు చెందిన 15 బస్సులు ఇందిరాపార్క్-ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్స్, రాణిగంజ్-1,2 డిపోలకు చెందిన 40 బస్సులు ఇందిరాపార్క్- సికింద్రాబాద్, ఇందిరాపార్క్- మల్కాజిగిరి, ముషీరాబాద్ డిపో-2కు చెందిన 20బస్సులు ఇందిరాపార్క్- జామైఉస్మానియా, మెహదీపట్నం డిపోకు చెందిన 20 బస్సులు లక్డికాపూల్- టోలీచౌకీ, బర్కత్‌పురా డిపోకు చెందిన 20 బస్సులు లక్డికాపూల్- ఖైరతాబాద్,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి డిపోకు చెందిన 20లక్డికాపూల్-ఖైరతాబాద్, రాజేంద్రనగర్ డిపోకు చెందిన 20బస్సులు లక్డికాపూల్- రాజేంద్రనగర్ (రూట్ నెం 92),పలక్‌నుమా డిపోకు చెందిన 20 బస్సులు ఆల్ ఇండియా రేడియో- కోటీ, జీడిమెట్లకు డిపోకు చెందిన 40బస్సులు ఖైరతాబాద్- జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజులరామారం, కూకట్‌పల్లి డిపోకు చెందిన 50బస్సులు ఖైరతాబాద్-బోరబండ,బాచుపల్లి, మియాపూర్ 1, 2 డిపోలకు చెందిన 45 బస్సులు ఖైరతాబాద్- బాచుపల్లి, లింగంపల్లి,కూకట్‌పల్లి, బిహెచ్‌ఈఎల్‌కు డిపోకు చెందిన 15 బస్సులు ఖైరతాబాద్- పటాన్‌చెరు, రాణిగంజ్ డిపో-1కు చెందిన 15 బస్సులు ఖైరతాబాద్-సికింద్రాబాద్ 29డిపోలకు చెందిన మొత్తం 565బస్సులు ఆయా ప్రాంతాల మధ్య తిరుగుతాయన్నారు. వీటి నిర్వాహణను ఆయా డిపోల డీఎం, డీవీఎంలు పర్యవేక్షిస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News