Wednesday, May 1, 2024

ప్రధాని కోసం ప్రత్యేక సొరంగ మార్గం!

- Advertisement -
- Advertisement -

Narendra-Modi

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి భద్రతకు మరింత పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రధాని నివాసం నుంచి పిఎంఓకు, పార్లమెంటు భవనానికి ప్రత్యేక రహదారిని నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ ఒక ప్రత్యేక టన్నెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని పార్లమెంటు భవనంకు లేదా అతని కార్యాలయానికి వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్ క్లియరెన్స్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనానికి కొన్ని ప్రత్యేక రహదారులు నిర్మించాలని పటేల్ చెప్పారు. తద్వారా సాధారణ ట్రాఫిక్ నుంచి ప్రధాని వంటి వివిఐపిలను వేరు చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. సెంట్రల్ విస్టాలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక టన్నెల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ తెలిపారు.

special tunnel route for Prime Minister Narendra Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News