Saturday, May 4, 2024

విమాన ప్రయాణికుల కాలినడక

- Advertisement -
- Advertisement -

SpiceJet Passengers Forced to Walk

స్పైస్‌జెట్ పాట్ల లీల

న్యూఢిల్లీ : ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికులు పాదయాత్రకు దిగాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన స్పైస్‌జెట్ విమానం ప్రయాణికులు శనివారం రాత్రి విమానం దిగగానే వారిని తీసుకువెళ్లేందుకు బస్సు రాకపోవడంతో వారు ముప్పావు గంట పాటు వేచి ఉండి చేసేది లేక విమానాశ్రయ మార్గం టర్మాక్‌పైనే నడిచివెళ్లాల్సి వచ్చింది. ఒకటిన్నర కిలోమీటర్ల మేర వీరు కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. తాము దిగిన చోటికి చాలా దూరంలో బస్సులు ఉండటంతో నడిచివెళ్లాల్సి వచ్చింది. నడకపాట్లు తప్పలేదని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన లాస్య నడింపల్లి తెలిపారు. సాధారణంగా భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో ఎవరిని ఎయిర్‌పోర్టు టర్మాక్‌పై నడిచేందుకు అనుమతించరు. అయితే ఈప్రయాణికులు వేరే దారిలేక ఈ మార్గం ద్వారానే చాలా దూరం వరకూ వెళ్లాల్సి వచ్చింది. అయితే బస్సులను పంపించడంలో ఆలస్యం అయిందని, కొద్ది సేపు వేచి ఉండాలని చెప్పినా కొందరు వినకుండా నడిచి వెళ్లారని, తాము చేసిన తప్పేమీ లేదని స్పైస్‌జెట్ విమానాల నిర్వాహకులు ఓ ప్రకటన వెలువరించారు. హైదరాబాద్ నుంచి ఈ విమానం 186 మంది ప్రయాణికులతో వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News