Friday, May 3, 2024

దేశాన్ని బాగుచేస్తాం

- Advertisement -
- Advertisement -

ఆ అవకాశం దేవుడు మనకిస్తాడు

కేంద్ర పాలకుల అసమర్థత వల్లే
దేశానికీ అధోగతి అనేక
సమస్యలు ఇంకా విలయ
తాండవం చేస్తున్నాయి
తెలంగాణలో మాదిరిగా కేంద్రంలో
పాలన జరిగి ఉంటే అనేక
రంగాల్లో అగ్రస్థానంలో ఉండేది
కేంద్రంలో ఉన్నవారికి సమర్థపాలన
చేతకావడం లేదు దుష్ట శక్తుల
ఆటలు ఎక్కువకాలం సాగవు
చివరికి మానవత్వమే
గెలుస్తుంది స్వాతంత్రం వచ్చి
75ఏళ్లు అవుతున్నా
గ్రామాలకు నీటి సౌకర్యం లేదు
అనేక గ్రామాలు
మగ్గుతున్నాయి దేశం ఎక్కడికి
పోతోంది..మన కంటే చిన్న దేశాలు
పరుగులు తీస్తున్నాయి వనరులకు
డోకా లేకపోయినా అభివృద్ధిలో
వెనుకబడి పోవాల్సిందేనా?:
విందులో

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో మాదిరిగా కేంద్రంలో పాలన జరిగి ఉంటే అనేక రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న వారికి సమర్థవంతమైన పాలన చేయడం చేతకావడం లేదని ఆయన విమర్శించారు. అందుకే దేశంలో అనేక సమస్యలు ఇంకా విలయతాండవం చేస్తున్నాయని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఎనిమిది సంవత్సరాల్లో అనేక రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతూ రోల్‌మోడల్‌గా నిలుస్తోందన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలన్న తపన, పాలన సాగిస్తున్నామని కెసిఆర్ తెలిపారు. అందుకే తెలంగాణ రాష్ట్రం అద్భుత విజయాలను సాధిస్తోందన్నారు. దేవుడు తెలంగాణను ఎలాగైతే అభివృద్ది పథంలో నడిపించి, ఈ స్థాయికి తీసుకొచ్చారో, వైపు కూడా మమ్మల్ని అలాగే నడిపిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. అందులో ఎలాంటి అనుమానమే లేదన్నారు. మనకు కూడా ఈ దేశం కోసం పనిచేసే అవకాశం వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ఈ దేశంలో దుష్టశక్తుల ఆటలు ఎక్కువ కాలం కొనసాగవన్నారు. కొన్ని రోజుల పాటు వారిదే పై చేయి అయినట్లు కనిపిస్తుందన్నారు. కానీ చివరికి మానవత్వమే గెలుస్తుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మానవత్వం ఎప్పుడూ నశించదన్నారు. మాసం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో రాష్ట్రం ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ విందుకు సిఎం కెసిఆర్ హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా తెలంగాణలో మైనార్టీల పిల్లలకు పాఠశాలలు, వసతిగృహాలు నిర్మించామన్నారు. ఆ అల్లా దయవల్ల…. అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ సహకారం, మద్దతుతో రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలోనే ప్రగతి పథంలోకి తీసుకవెళ్లగలిగామన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండేవన్నారు. ప్రజలకు కరెంటు లేదు…తాగునీరు లేదు…వ్యవసాయ రంగానికి సాగునీరు లేదు… రైతున్న ఆత్మహత్యలు… పంటలు ఎండిపోయి ఎడారిగా మారిన తెలంగాణను శరవేగంగా అభివృద్ధి చేయగలిగామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల పాటు, నాణ్యమైన కరెంటును అందిస్తున్నామన్నారు. అలాగే ప్రజలకు తాగునీటి కొదవ లేదన్నారు.వ్యవసాయానికి అవసరమైన సాగునీటికి కొరత లేకుండా చూశామన్నారు. అనేక ప్రాజెక్టులను నిర్మించుకుని నేడు దేశానికే అన్నం పెట్టే స్థితిలో తెలంగాణను తీసుకొచ్చామని సిఎం కెసిఆర్ అన్నారు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. చుట్టూ అంధకారం ఉన్నా ఒక మణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్నదన్నారు. వెలుగు జిలుగుల తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామన్నారు. మన రాష్ట్రంలా కేంద్రం కూడా పనిచేసి ఉం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై నుంచి కోల్‌కతా వరకు 24 గంటలకరెంట్ ఉండేదన్నారు. అలాగే దేశ జిడిపి కూడా పెరిగి ఉండేదన్నారు. కనీసం మన స్థూల దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) వృద్ధి రేటును కూడా కేంద్రం నమోదు చేయలేకపోతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు జిఎస్‌డిపి సుమారు 5 లక్షల కోట్లుగా ఉండేదని… కానీ నేడు రెట్టింపు చేసుకొని 11 లక్షల 50 వేల కోట్లకు చేరుకున్నదని ఆయన వెల్లడించారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేసుం రాష్ట్ర జిఎస్‌డిపి 11.5 లక్షల కోట్లు కాకుండా 14.5 లక్షల కోట్లుగా ఉండేదన్నారు. ఇది తాను చెబుతున్న లెక్క కాదన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చెబుతున్న లెక్కలు…. ఆర్థిక నిపుణులు అంటున్న మాటలన్నారు. ఇలా అద్భుతమైన ప్రగతితో ముందుకు సాగుతున్నామన్నారు. చిన్న రాష్ట్రమే ఈ స్థాయిలో అభివృద్ధిగా దిశగా పరుగులు తీస్తుంటే…కేంద్రం ఎందుకు మొద్దు నిద్రపోతున్నదని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా దేశంలో అనేక గ్రామాలకు నీటి సౌకర్యం లేదు…..వందలాది గ్రామాలు కరెంటు లేక చీకటిలోనే మగ్గుతున్నాయని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చూస్తుంటే దేశం ఎక్కడి పోతుందని ప్రశ్నించారు. ఇదేనా పాలకులకు ఉండాల్సిన విజన్ అని నిలదీశారు. మనకన్నా చిన్న చిన్న దేశాలు అభివృద్ధిలో పరుగుపెతుంటే….మన దేశంలో సహజవనరులు, ఖనిజ సంపదకు డోకా లేకపోయినప్పటికీ అభివృద్ధిలో ….ఆమాడ దూరంలోనే ఉండిపోవాల్సి వస్తోందని విమర్శించారు.

ఇదేం ఖర్మ? అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి నుంచి దేశానికి విముక్తి కల్పించాల్సిన అవసరముందన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర పక్షాన తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని అన్నారు. కేంద్రం బలహీనంగా ఉంటే రాష్ట్రం కూడా బలహీనంగానే ఉంటుందన్నారు. దేనినైనా కూల్చడం చాలా సులభమే కాని… నిర్మించడమే చాలా కష్టమన్నారు. బెంగళూరులో ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయో చూస్తున్నామన్నారు. దేశమంతా ఇలాగే నడుస్తోందన్నారు. ఇది సరైన పద్ధతి కాదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో బిజెపి వ్యవహారం కూడా ప్రజల ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. ఆ పార్టీల నేతల ఆటకట్టించడానికి ఇంకా ఎంతో కాలం పట్టదన్నారు. ఈ విందు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News