Saturday, May 4, 2024

జిల్లాలకు కదలండి

- Advertisement -
- Advertisement -

CM KCR

 

కరోనాపై ప్రభుత్వ నిర్ణయాల అమలుతీరును పరిశీలించండి
ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
నేడు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న అధికారుల బృందం
కేసులు పెరుగుతున్న
ప్రాంతాలపై సిఎం ప్రత్యేక దృష్టి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై సిఎం కెసిఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సిఎస్ సోమేశ్ కుమార్, డి జిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. హై దరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సిఎం సమీక్షించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరుగుతున్న వైనంపై ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. సిఎం ఆదేశం మేరకు సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ము ఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హె ల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం సూర్యాపేట, గ ద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.

సివిల్ సర్వెంట్స్‌కు సిఎం ప్రశంసలు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అహోరాత్రు లు శ్రమిస్తున్న వైద్యులు, పారిశుద్ధ సిబ్బంది, పోలీసులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. వారు చేస్తున్న సేవలను అశేష ప్రజానీకం వెన్నోళ్ల కొనియాడుతోంది. ఈ నేపథ్యంలో వారికి ప్రోత్సాహకాల నందించడమే కాదు.. కోవిడ్19 మహమ్మారిని పారద్రోలేందుకు తమ ప్రాణాలు పణంగా పె డుతూ విధులు నిర్వర్తిస్తున్న సదరు సివిల్ సర్వెంట్స్‌ను సిఎం ప్రశంసించారు. సివిల్ సర్వె ంట్స్‌గా వీరు చేస్తున్న సేవల ద్వారా ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని కొనియాడారు.

కేసులు పెరుగుతున్న జిల్లాలపై దృష్టి
కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలపై సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధితో పాటు సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, నిర్మల్ తదితర జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు యుద్దప్రాతిపదికన పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ తరువాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల జాబితాలో సూర్యాపేట కూడా చేరింది. ఈ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54కు చేరడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ జిల్లాలో కరోనా వ్యాప్తిని నిలవరిచేందుకు ప్రత్యేక అధికారిగా వేణుగోపాల్ రెడ్డిని నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈయన ప్రస్తుతం తెలంగాణ పురపాలక డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేటలో ఇప్పటివరకు 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 564 మంది శాంపిల్స్‌ను సేకరించగా… 62 మందికి సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ క్వారంటైన్‌లో 182 మంది, హోం క్వారంటైన్‌లో 683 మంది ఉన్నారు.

జిహెచ్‌ఎంసి పరిధిలో 12 ల్యాబ్‌లకు అనుమతి
కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) దేశంలోని పలు ప్రైవేట్ ల్యాబ్‌లకు కరోనా టెస్ట్ చేసేందుకు అనుమతులు జారీ చేసింది. ఇందులో తెలంగాణలో మొత్తం 12 ల్యాబ్‌లకు అనుమతి లభించింది. ఇవన్నీ గ్రేటర్ పరిధిలోనే ఉండడం విశేషం. వాటిల్లో అపోలో హాస్పిటల్ (జూబ్లీహిల్స్), విజయ డయాగ్నస్టిక్స్ ( హిమాయత్ నగర్), విమత ల్యాబ్స్ (ఐడిఎ చర్లపల్లి), అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ (బోయిన్‌పల్లి), డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్ (పంజాగుట్ట), పాత్‌కేర్ ల్యాబ్స్ (మేడ్చల్), అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సర్వీసెస్(శేరిలింగంపల్లి), మెడ్సిస్ పాథ్‌ల్యాబ్స్ (న్యూ బోయిన్‌పల్లి), యశోద హాస్పిటల్స్ (సికింద్రాబాద్), బయోగ్నసిస్ టెక్నాలజీస్ (మేడ్చల్ మల్కాజిగిరి), స్టార్ హాస్పిటల్ (బంజారాహిల్స్), టెనెట్ డయాగ్నస్టిక్స్ (బంజారాహిల్స్)లు ఉన్నాయి. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ అందాల్సి ఉంది.

 

State level Officials should tour District
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News