Tuesday, April 30, 2024

రేపు కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా: వినయ్ భాస్కర్

- Advertisement -
- Advertisement -

Strike against Modi govt

వరంగల్: శుక్రవారం కేంద్రానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటాయని ఎంఎల్‌ఎ వినయ్ భాస్కర్ తెలిపారు. వరంగల్ ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని విధాలుగా అండగా ఉంటుందన్నారు. రైతులకు సహాయం చేసే ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని ప్రశంసించారు. రైతులకు రైతు బంధు, రైతు బీమాతో పాటు గిట్టు బాటు ధర అందించి ఆదుకున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని కొనియాడారు. కేంద్రం మాత్రం రైతులు పండించిన వడ్లు కొనడం లేదని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం వడ్లు కొనేవరకు ధర్నాలు చేద్దామని వినయ్ పిలుపునిచ్చారు. బిజెపి నాయకులను ప్రజల మధ్యలో నిలదీస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం అమ్ముతోందని దుయ్యబట్టారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసిని ఎందుకు అమ్ముతున్నారని మోడీ ప్రభుత్వాన్ని వినయ్ నిలదీశారు. తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఒక వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. సిఎం కెసిఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News