Friday, April 26, 2024

నేను కూడా రొమాంటిక్ అయిపోయా

- Advertisement -
- Advertisement -

Sunil Kashyap about 'Romantic' Movie

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం ఈనెల 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు అనిల్ పాదురి తెరకెక్కించిన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. సునీల్ కశ్యప్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో సరదాగా చేసిన పాటలు చాలా ఉన్నాయి. మా ఇస్మార్ట్ గ్యాంగ్ అంతా అలా కూర్చొని సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్’. పూరికి కూడా పాటలు చాలా నచ్చాయి. అనిల్ అయితే పర్టిక్యులర్‌గా ఆ పాటలే కావాలని అనేవాడు. కథ విన్నప్పటి నుంచి, రొమాంటిక్ టైటిల్ అని పెట్టినప్పటి నుంచి నేను కూడా రొమాంటిక్ అయిపోయి ఈ పాటలను కంపోజ్ చేశాను. ఈ చిత్రంలో కేతిక శర్మ కూడా ఓ పాట పాడింది. ఆమె పాడిన నా వల్ల కాదే… అనే పాట పెద్ద హిట్ అయింది. ఈ మధ్య విడుదల చేసిన వాస్కోడిగామ… పాటలో ఆకాష్ వాయిస్ అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ‘గాడ్సే’ సినిమాను చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను”అని అన్నారు.

Sunil Kashyap about ‘Romantic’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News