Saturday, April 27, 2024

అవినాష్ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంలో సునీతా రెడ్డి పిటిషన్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 25వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ… జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో వివేక కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సవాలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి తెంటాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఏప్రిల్ 25 వరకు సిబిఐ అరెస్టు చేయకుండా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Also Read: నదిలో మొసలితో పోరాడి భర్తను కాపాడిన భార్య

అవినాష్ రెడ్డి పిటిషన్‌పై ఏప్రిల్ 25న తుది తీర్పు వెలువరిస్తామని కూడా హైకోర్టు తెలిపింది. కాగా..మధ్యంతర బెయిల్‌ను సవాలు చేస్తూ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం దీనిపై విచారణ చేపడతామని తెలిపింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గత నెలలోనే సిబిఐని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని, అవినాష్ సహాయకుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. వీరిద్దరిని ఆరు రోజుల పాటు సిబిఐ రిమాండ్‌కు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వరుసగా రెండవరోజు గురువారం వీరిద్దరినీ సిబిఐ తన కార్యాలయంలో విచారిస్తోంది. చంచల్ గూడ జైలులో ఉన్న వీరిద్దరినీ సిబిఐ కార్యాలయానికి తరలించిన అధికారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రెండవరోజు సిబిఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News