Monday, April 29, 2024

సూపర్‌స్టార్ రజనీకాంత్ 71వ జన్మదిన వేడుక… అభినందన జల్లులు

- Advertisement -
- Advertisement -

Superstar Rajinikanth is celebrating his 71st birthday

 

చెన్నై : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ 71 వ జన్మదిన వేడుక సందర్భంగా ఆదివారం ప్రముఖులు అభినందన జల్లులు కురిపించారు. ప్రధాని మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర నాయకులు, సినీరంగ ప్రముఖులు, నటులు, అభిమానులు, సెలబ్రిటీలు అభినందనలు తెలియచేస్తూ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థులు ఎవరైతే కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమౌతున్నారో వారికి ఉచితంగా కోచింగ్ ఇస్తామని రజనీకాంత్ అభిమాన సంఘం ప్రకటించింది. సృజనాత్మకత, అద్భుత నటన ద్వారా ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తి కలిగించాలని ప్రధాని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. 72 లో అడుగుపెడుతున్న రజనీకాంత్ తన నటనా వైభవంతో మరికొన్నేళ్లు ప్రజలకు చైతన్యం కలిగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆకాంక్షించారు. రజనీతో ఆయన ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రి శ్రీపాద్ వై నాయక్, తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News