Sunday, May 12, 2024

కెంటకీలో టోర్నడో బీభత్సం… 70 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Kentucky tornadoes: At least 70 killed

మేఫీల్డ్ : తీవ్రమైన పెనుగాలులు, టోర్నడోలతో అమెరికా కంపించి పోతోంది. దాదాపు ఐదు నుంచి పది రాష్ట్రాలు టోర్నడోలతో చిన్నాభిన్నం అయ్యాయి. ముఖ్యంగా భారీ టోర్నడో కారణంగా కెంటకీ రాష్ట్రంలో పరిస్థితి భీతావహంగా మారిందని, రాష్ట్ర చరిత్ర లోనే ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా కెంటకీ గవర్నర్ ఆండీ బేషియర్ ఆందోళన వెలిబుచ్చారు. ఓ క్యాండిల్ ఫ్యాక్టరీ కూలిపోవడంతో శిధిలాల కింద 110 మంది వరకు చిక్కుకు పోయారని, వారిలో 70 మంది వరకు చనిపోయి ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. మొత్తం 10 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఈ టోర్నడోల వల్ల మృతుల సంఖ్య 100 కు మించి ఉండవచ్చని తెలిపారు. 200 మైళ్ల మేర తుపాను ప్రభావం కనిపించిందన్నారు. కెంటుకీలో ఫ్యాక్టరీతోపాటు ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్ విల్లే లోని అమెజాన్ సంస్థ గొదాము ధ్వంసం అయింది. వెస్టర్న్ కెంటకీ లోని మేఫీల్డ్ నగరం భవనాల శిధిలాలు, కూలిన చెట్లతో నిండిపోయింది. శిధిలాలను తొలగించి బాధితులకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో అత్యయిక పరిస్థితి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News