Tuesday, April 30, 2024

కూల్చివేతల స్థలిలోనే కొత్త వెంచర్

- Advertisement -
- Advertisement -

Supertech Eyes New Project On Noida Site

నోయిడా సూపర్‌టెక్ సంసిద్ధం

న్యూఢిల్లీ : నోయిడాలో కూల్చివేతకు గురైన జంట బహుళ అంతస్తుల స్థలంలోనే సరికొత్త గృహ సముదాయాన్ని నిర్మిస్తామని సూపర్‌టెక్ రియల్ ఎస్టేట్ సంస్థతెలిపింది. అక్రమ కట్టడాలుగా తేలడంతో ఈ నిర్మాణాలను అత్యంత భారీ హైటెక్ సాధనాసంపత్తితో ఇటీవలే కూల్చివేశారు. ఈ క్రమంలో నిర్మా ణ సంస్థ సూపర్‌టెక్‌కు రూ 500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇదే స్థలంలో తమ వెంచర్‌కు నిర్మాణ అనుమతిని ఇవ్వాలని తాము అధికారులను కోరుతామని సంస్థ ఛైర్మన్ ఆర్‌కె అరోరా తెలిపారు. ఒక వేళ ఏమైనా కారణాలతో నిర్మాణానికి అనుమతిని ఇవ్వకపోతే తమకు ఈ స్థలం వ్యయం, ఇతర ఖర్చులను కట్టి ఇవ్వాలని డిమాండ్ చేస్తామని వెల్లడించారు. కూల్చివేతల స్థలం నుంచి శిథిలాల తొలిగింపు ప్రక్రియ ముగిసింది. ఇక్కడ తమ సంస్థ కొత్త హౌసింగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతుందని, దీనికి సంబంధించిన ప్ర తిపాదనలను నోయిడా అభివృద్ధి సంస్థకు పంపిస్తామని అరోరా తెలిపారు. అవసరం అయితే ఎమెరాల్డ్ కోర్టు ఆర్‌డబ్లుఎ నుంచి కూడా అనుమతి తీసుకుంటామని, ఇక్కడ గృహసముదాయాల నిర్మాణానికి తమ సంస్థకు నోయిడా అధికారులు గతంలో 14 ఎకరాల స్థలం మంజూరు చేశారని, ఇందులో కట్టడాల కూల్చివేత జరిగిన స్థలం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉందని, ఇక్కడనే తమ కొత్త ప్రాజెక్టు ఉంటుందని సంస్థ అధినేత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News