Friday, April 26, 2024

యంగ్ టాలెంట్‌కు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

రెగ్యులర్ సినిమాలే కాకుండా యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించి డిఫరెంట్ కంటెంట్‌ని ఆడియన్స్‌కు అందించాలన్నదే మా లక్ష్యం అని అంటున్నారు ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ప్రస్తుతం ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందిన రెండు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే ఈ బ్యానర్‌లో మరో మూడు చిత్రాల నిర్మాణం జరుగుతోంది. గురువారం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత కె. నిరంజన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు…

సినిమాలపై ఆసక్తితో…
మాది నల్గొండ జిల్లా. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఇంజనీరింగ్ పూర్తయ్యాక మాస్టర్స్ చేయడానికి యుఎస్ వెళ్లాను. అది పూర్తయ్యాక రెండేళ్లు జాబ్ చేసి ఆతర్వాత ఒక ఐటి కంపెనీని ప్రారంభించాను. అనంతరం రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్కడా రాణించాం. అయితే సాధారణంగానే సినిమా అనేది మన లైఫ్‌లో ఒక భాగం. ఇక నాకు సినిమాలపై ఆసక్తి ఎక్కువ. దీంతో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ని స్థాపించి చిత్ర నిర్మాణరంగంలోకి ప్రవేశించాను. భవిష్యత్తులో సొంతంగా ఒక ఓటీటీ పెట్టే ఆలోచన కూడా ఉంది.

వరుసగా సినిమాలు…
మాకు మంచి టీమ్ కుదిరింది. అదేవిధంగా సమయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం కాబట్టి ఒక ఏడాదిలోనే రెండు సినిమాలు చేయగలిగాము. మరో మూడు ప్రాజెక్టులు చేయబోతున్నాము. ఈవిధంగా వరుసగా సినిమాలు చేస్తున్నాము.

డిఫరెంట్ జోనర్స్‌లో…
ప్రస్తుతం మా బ్యానర్‌లో రూపొందిన ‘హౌస్ అరెస్ట్’ చిత్రాన్ని థియేటర్స్ ఓపెన్ చేయగానే వెంటనే రిలీజ్ చేస్తాం. ఈ సినిమాను ఫ్యామిలీస్ పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే రెండు వారాలలో ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ చిత్రాన్ని విడుదల చేస్తాం. అదేవిధంగా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్‌లో ‘హను—–మాన్’ మూవీ చేస్తున్నాము. స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ తరహాలో ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇక మేము డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలు తీస్తున్నాము.

యంగ్ టాలెంట్‌కు ప్రోత్సాహం…
కొత్త కంటెంట్ ఉండాలి… అనేది మా అజెండా. యంగ్ టాలెంట్‌ను మేము ప్రోత్సహిస్తున్నాము. కొత్త వారితో సినిమాలు తీస్తున్నాము.

అది రూమర్ మాత్రమే…
ఈ కరోనా సమయంలో థియేటర్స్ మూతపడడం చాలా బాధాకరమైన విషయం. దీంతో థియేటర్ సిస్టమ్ అనేది కనుమరుగైపోతుందనేది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే థియేటర్స్ మళ్లీ యధావిధిగా నడుస్తాయి. ప్రేక్షకులు ఎప్పుడూ కూడా సినిమాను థియేటర్లలో చూడడానికే ఇష్టపడతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News