Friday, May 3, 2024

ఆ డాక్టర్‌ను కౌన్సెలింగ్‌కు అనుమతించండి

- Advertisement -
- Advertisement -
Supreme Court allows doctors
ఎయిమ్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్, పోస్ట్ డాక్టొరల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎయిమ్స్ ఈ నెల 31 నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఒక డాక్టర్‌ను అనుమతించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఎయిమ్స్‌ను ఆదేశించింది. ఈ కేసులో ప్రత్యేక అంశాలు, పరిస్థితుల కారణంగా, పెరిగిపోయిన కరోనా కేసుల కారణంగా పరీక్షలు సకాలంలో నిర్వహించక పోవడం, ఇప్పటికీ రిషీకేశ్ ఎయిమ్స్‌లో ఒక సీటు అందుబాటులో ఉన్న కారణంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడిన బెంచ్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. న్యూఢిల్లీ ఎయిమ్స్ పోస్టుగ్రాడ్యుయేట్ , పోస్ట్ డాక్టోరల్ కోర్సుల్లో అడ్మిఫన్లకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ముంబయిలోని ఇన్‌సిట్టేట్ ఆఫ్ నేవల్ మెడిసిన్‌లో జనరల్ మెడిసిన్‌లో ఎండి కోర్సు ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్ వరద అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

అంతేకాదు ఆన్‌లైన్ సెలెక్షన్ ప్రక్రియలోను ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ క్లినికల్, ప్రాక్టికల్ తదితర అసెస్‌మెంట్లలో కూడా పాల్గొన్నాడు. దీంతో అతడికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కోర్సులో సీటు ఆఫర్ చేస్తూ జూలై 1నుంచి 15వ తేదీలోగా చేరాలని, లేని పక్షంలో కేటాయించిన సీటు రద్దవుతుందని పేర్కొన్నారు. అయితే మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా అక్కడి హెల్త్ యూనివర్సిటీ ఫైనల్ ఎండి పరీక్షలను వాయిదా వేసింది. అయితే ఎయిమ్స్ పోస్టు డాక్టొరల్ కోర్సు ప్రాస్పెక్టస్ ప్రకారం అభ్యర్థులందరూ జూలై 31 నాటికి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేయాలి. లేకపోతే అడ్మిషన్ తీసుకోవడానికి అనర్హుడిగా ప్రకటిస్తారు. జూలై 19న ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయిందని, అయితే సీట్ల కేటయింపు చివరి తేదీని ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించినట్లు ఎయిమ్స్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కాగా మహారాష్ట్ర హెల్త్ యూనివర్సిటీ ఎంఎస్/ఎండి కోర్సుల ఫైనల్ థియరీ పరీక్షలు ఆగస్టు 1623 మధ్య, ప్రాక్టికల్ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో జరుగుతాయని, పిటిషనర్ ఫలితాలు 27న ప్రచురిస్తారని యూనివర్సిటీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అప్పుడు కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నెల 27న ఈ విషయాన్ని విచారిస్తామని, అప్పటికి పిటిషనర్ అవసరమైన అర్హత పొందితే, ఒక వేళ ఏదయినా సీటు ఖాళీ ఉంటే పిటిషనర్‌ను అడ్మిషన్‌కు అనుమతించాలని మౌఖికంగా పేర్కొంది. కాగా శుక్రవారం ఈ అంశం విచారణకు రాగా మహారాష్ట్ర హెల్త్ యూనివర్సిటీ పిటిషనర్‌కు జారీ చేసిన ప్రొవిజల్ డిగ్రీ సర్టిఫికెట్ ఫొటో కాపీని కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ నెల 31న జరిగే కౌన్సెలింగ్‌కు పిటిషనర్‌ను అనుమతించాలంటూ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News