Friday, April 26, 2024

నిందితుల సరైన గుర్తింపుతోనే సాక్షానికి విలువ

- Advertisement -
- Advertisement -

Supreme Court issued key ruling on issue of witnesses

కేరళ స్పిరిట్ కేసు విచారణదశలో సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఏదేనీ నేరంలో నిందితుల గుర్తింపులో సాక్షుల అంశం గురించి సుప్రీంకోర్టు కీలక రూలింగ్ వెలువరించింది. నేరం సమయంలో నిందితులను తొలిసారిగా చూసినట్లు అయితే నిందితుల గుర్తింపుపై సదరు సాక్షి చెప్పే సాక్షం బలహీన సాక్షం అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా నేర ఘటన, సాక్షి వాంగూల్మం నమోదు ప్రక్రియల మధ్య చాలా ఎక్కువ వ్యవధి ఉంటే ఈ సాక్షం మరింత బలహీనం అవుతుందని తెలిపింది. ఈ కోణంలో నేర ఘటనలో నిందితుల గుర్తింపు ప్రక్రియలో ఈ సాక్షానికి విలువను లెక్కలోకి తీసుకోవల్సి ఉంటుంది. సారాయి అక్రమ రవాణాకు సంబంధించి కేరళ అబ్కారీ చట్టం పరిధిలో దోషులుగా ఖరారయిన నలుగురు పెట్టుకున్న పిటిషన్లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు వెలువరించింది. 6090 లీటర్ల స్పిరిట్ రవాణాకు సంబంధించి నలుగురికి దోష నిర్థారణ జరిగింది.

సంబంధిత కేసులో ఓ సాక్షి తాను నిందితులను 11 సంవత్సరాల క్రితం నేరం జరిగిన సమయంలో చూశానని, అదీ కూడా వారిని చూడటం తొలిసారి అని, వీరిలో ఇద్దరినే ఇప్పుడు అప్పట్లో అక్కడున్న వారిగా చెప్పగలనని తెలిపారు. ఇది అనిర్థారిత సాక్షం పరిధిలోకి వస్తుందని పరిగణించి న్యాయస్థానం ఈ వాంగ్మూలాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అభయ్ ఎస్ ఒకాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిందితులను సాక్షులు గుర్తించే ప్రక్రియను కోర్టులు విశ్వసనీయతతో చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జాగరూకత అవసరం అని ధర్మాసనం తెలిపింది. ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే నిందితుల గుర్తింపు ప్రక్రియ సక్రమ కోణంతో నేర నిర్థారణ, దోషుల ఖరారు జరగాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News